సీటు అక్కడా ఇక్కడా ?  ఎక్కడో తేల్చుకోలేకపోతున్న ‘ తుమ్మల ‘ 

మాజీ మంత్రి ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఆయనతోపాటు, ఎవరికి అర్థం కావడం లేదు.

ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు .ఆయన ఎప్పటి నుంచో పాలేరు నియోజకవర్గం పై ఆశలు పెట్టుకున్నారు.

  ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు.

అయితే కేసీఆర్ మాత్రం ఆ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( Kandala Upender Reddy ) కి కేటాయించారు.

దీంతో తుమ్మల తీవ్ర సంతృప్తికి గురై పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు.ఆయనను చేర్చుకునేందుకు బిజెపి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నా , ఆయన కాంగ్రెస్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఇంకా పార్టీలో చేరే విషయంలో తుమ్మల ఏ నిర్ణయం తీసుకోలేదు.

"""/" /  తుమ్మల అనుచరులు మాత్రం ఖమ్మం అసెంబ్లీ లేదా పాలేరు నియోజకవర్గం ఈ రెండిట్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

అయితే తుమ్మల మాత్రం పూర్తిగా పాలేరు నియోజకవర్గంపైనే ఆసక్తి చూపిస్తున్నారు.ఇక్కడ చాలా కాలంగా పర్యటనలు చేస్తున్నారు.

గతంలో తాను చేసిన అభివృద్ధి ఇవన్నీ ఈ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకున్నాయని, తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.

ఇక తుమ్మల చేరికకు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి,  సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు స్వాగతిస్తున్నారు.

అయితే ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలనే షరతులు విధించారు.

నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల తాను సూచించిన వారికి టిక్కెట్ ఇవ్వాలనే కండిషన్ పెట్టారు.

ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించినట్లు ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్ లో  చేరితే పాలేరు నియోజకవర్గంతో పాటు,  తన అనుచరులకు టికెట్ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో కాంగ్రెస్ ఇంకా ఏ క్లారిటీకి రాలేదు.

"""/" /  పాలేరు నుంచి టిక్కెట్ దక్కే అవకాశం లేకపోతే , ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని తుమ్మలపై ఒత్తిడి వస్తున్నా,  ఆయన ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

దీనిపై క్లారిటీ వస్తేనే కాంగ్రెస్ లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఇక బీఆర్ఎస్ సైతం తుమ్మలను వదులుకునేందుకు సిద్ధంగా లేదు.

ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీను కూడా ఇచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండడంతో,  కాంగ్రెస్ లోనే చేరడం ఖాయంగా మారింది .

అయితే సీటు విషయంలోనే ఒక  క్లారిటీ వస్తేనే తుమ్మల రాజకీయ భవిష్యత్తుపై ఒక క్లారిటీ వస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్29, శుక్రవారం 2024