పొడి ద‌గ్గు వేధిస్తుందా.. అయితే ఈ టీ తాగాల్సిందే!

పొడి ద‌గ్గు.దాదాపు అంద‌రినీ ఎదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ఎలాంటి క‌ఫం లేక‌పోయినా వ‌చ్చే ద‌గ్గునే పొడి ద‌గ్గు అంటారు.ఈ పొడి ద‌గ్గు వ‌ల్ల వ‌చ్చే విసుకు, చికాకు అంతా ఇంతా కాదు.

వాతావ‌రణం మార్పులు, ఆస్త‌మా, జ‌లుబు, ఫ్లూ, పొగ, దుమ్ము, పొల్యూషన్, స్మోకింగ్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొడి ద‌గ్గు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే పొడి ద‌గ్గు వేధించే స‌మ‌యంలో ఏదో ఒక టానిక్స్‌ను తీసుకోవ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా పొడి ద‌గ్గును నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా తుల‌సి టీ పొడి ద‌గ్గుకు చెక్ పెట్ట‌డంతో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ముందుగా గుప్పెడు ఫెష్‌గా ఉన్న తుల‌సి ఆకుల‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క‌, అర స్పూన్ మిరియాల పొడి మ‌రియు యాల‌కుల పొడి వేసి బాగా మ‌రిగించాలి.

అనంతరం దీనిని వడ‌గ‌ట్టుకుని.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.

ఈ తుల‌సి టీని రోజుకు రెండు క‌ప్పుల చ‌ప్పున తీసుకోవాలి. """/" / ఇలా తీసుకుంటే పొడి ద‌గ్గు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

పొడి దగ్గుకి కారణం ఏదైనా కూడా ఈ తుల‌సి టీ తీసుకుంటే త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌ల‌రు.

ఇక ఈ తుల‌సి టీ తీసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం పొడి ద‌గ్గు త‌గ్గ‌డ‌మే కాదు మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ముఖ్యంగా మ‌ధుమేహం వ్యాధితో బాధ ప‌డేవారు రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు తుల‌సి టీ తీసుకుంటే.

అందులో ఉండే ఫాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాయాటీ యాసిడ్స్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేస్తుంది.

"""/" / అలాగే డిప్రెషన్, ఒత్త‌డి, ఆందోళ‌న‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ తుల‌సి టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఇక చాలా మంది ముప్పై ఏళ్ల‌కే ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.

అయితే ప్ర‌తి రోజు ఒక క‌ప్పు తుల‌సి టీ తీసుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడూ య‌వ్వ‌నంగా, ఎ‌ట్రాక్టివ్‌గా క‌నిపించేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

వైరల్ వీడియో: ఈ పోలీస్ సార్ డాన్స్ ముందు ఏ స్టార్ పనికి రాడు అంతే..