అందరి ముందు నా జుట్టు కత్తరించారన్న తులసి.. ఏడ్చినా వదల్లేదంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న నటీమణులలో తులసి శివమణి ఒకరనే సంగతి తెలిసిందే.
బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన తులసి ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బాల నటిగానే 100కు పైగా సినిమాలలో నటించానని ఆమె అన్నారు.సినిమాలకు సంబంధించిన గైడెన్స్ ఇచ్చిందని అమ్మగారని తులసి పేర్కొన్నారు.
నేను బాల నటిగా నటించిన సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నా నటనకు మంచి మార్కులు పడ్డాయని తులసి వెల్లడించారు.
మా అమ్మ ఎప్పుడూ కేర్ తీసుకునేవారని ఆమె తెలిపారు.అమ్మగారిది తాడేపల్లి గూడెం అని నాన్నది చెన్నై అని తులసి కామెంట్లు చేశారు.
దేశం మొత్తం నాకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నారని ఆమె పేర్కొన్నారు.గుమ్మడి, జగ్గయ్య, ఎస్వీ రంగారావు గారికి నేనంటే ఇష్టమని తులసి తెలిపారు.
కోతలరాయుడు మూవీలో నటించే సమయంలో ఒక డైలాగ్ కు ఏడు టేక్స్ తీసుకుంటే అమ్మ తిట్టారని తులసి అన్నారు.
అప్పటినుంచి రెండో టేక్ లేకుండా షూట్ లో పాల్గొనాలని అనుకున్నానని తులసి చెప్పుకొచ్చారు.
సరిగ్గా చెయ్యకపోతే అమ్మ కోప్పడుతుందని భావించానని తులసి కామెంట్లు చేశారు. """/"/
ఒక సినిమాలో నన్ను అబ్బాయిగా చూపించడానికి విశ్వనాథ్ గారు జుట్టు కత్తిరించాలని చెప్పారని తులసి చెప్పుకొచ్చారు.
జుట్టు కత్తిరించాక నేను ఏడ్చానని తులసి అన్నారు.ఆ తర్వాత విశ్వనాథ్ గారు జుట్టు మరింత కత్తిరించాలని సూచించారని తులసి కామెంట్లు చేశారు.
తులసి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.తులసి ఈ ఏడాది కార్తికేయ2 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
తులసి మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.