తులసి మొక్క ఎండిపోతే పితృ దోషానికి సంకేతమా?

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఇంటి ఆవరణంలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది.

ఈ విధంగా తులసి మొక్కను దైవ మొక్కగా భావించి ప్రతి రోజూ పూజలు చేస్తాము.

ఇకపోతే తులసి మొక్క కొన్నిసార్లు ఎండిపోవడం జరుగుతుంది.ఇలా ఉన్నఫలంగా తులసి మొక్క ఎండిపోతే ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.

అయితే తులసి మొక్క ఎండి పోవడం అనేది దేనికి సంకేతం? తులసి మొక్క ఎండిపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

అప్పటి వరకు ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే తులసి మొక్క ఉన్నఫలంగా ఎండి పోవడం జరుగుతుంది.

తులసి మొక్క ఎండిపోవడం అనేది బుధగ్రహానికి సంబంధించిన విషయం.బుదుడు ఏ విధమైనటువంటి అశుభాన్ని ఇవ్వబోతున్న సమయంలో ఈ విధంగా తులసి మొక్క ఎండి పోవడం జరుగుతుంది.

ఇలా అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోతే పిత్రు దోషానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా ఇంట్లో కూడా గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. """/" / ఇలా తులసి మొక్క ఎండిపోతున్న సమయంలోనే తులసి మొక్కను తీసి వెంటనే ఆ తులసి మొక్కను నీళ్ళు పారుతున్న నదిలో లేదా చెరువులో కాలువలో పడేయాలి.

అదే సమయంలోనే దాని స్థానంలో మరొక కొత్త తులసి మొక్కలను నాటాలి.తులసి మొక్క ఆధ్యాత్మికంగాను ఆరోగ్య పరంగాను ఎంతో పవిత్రమైనది కనుక తులసి మొక్కను ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి.

ఇలా తులసి మొక్క ఆకస్మాత్తుగా ఎండిపోతే బుధగ్రహ ప్రభావం మనపై ఉంటుందని అర్థం.

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు