మీ కుటుంబ భవిష్యత్తును చెప్పే తులసి మొక్క మార్పు!

మన హిందూ సాంప్రదాయాలలో మొక్కలను పూజించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.అయితే తులసి మొక్కకు మరింత ఎక్కువ ప్రాముఖ్యత కల్పిస్తూ, పూజలు చేస్తూ ఉంటారు.

సాక్షాత్తు తులసి మొక్కను దైవంగా భావించి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర మనకు దర్శనమిస్తుంది.

తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు.అయితే కొన్నిసార్లు తులసి మొక్కలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.

ఈ మార్పులు దేనికి సంకేతం? తులసి మొక్కలో అలాంటి మార్పులు వచ్చినప్పుడు, మనకు ఏం జరుగుతుందో అన్న సందేహం కలుగుతుంది.

తులసి మొక్కలో ఈ మార్పులు జరిగినప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనేది ఇప్పుడు చూద్దాం! కొన్నిసార్లు మనం తులసి మొక్కకు నీళ్లు పోయకున్నా చాలా పచ్చగా, ఏపుగా పెరుగుతుంది.

ఇలా పెరగడం వల్ల మన ఇంట్లో సిరిసంపదలు కూడా అలాగే కలుగుతాయని సంకేతం.

అంతేకాకుండా మన ఇంట్లో అదృష్టం రాబోతోందని కూడా సూచిస్తుంది.మన ఇల్లు సుఖ సంతోషాలతో కలిగి ఉండడమే కాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా గడుపుతారు.

నిత్యం పచ్చగా ఉండే తులసి చెట్టు ఒక్కసారిగా ఎండిపోతే, అది ఆ ఇంటి యజమానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని సంకేతం.

అంతే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తుంది.కొన్నిసార్లు తులసి ఆకులు ఉన్నట్టుండి రంగు మారుతాయి.

ఇలా మారడం వల్ల మన ఇంటి మీద చెడు ప్రభావం పడిందని, మనఇంటికి మన శత్రువులు ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని సంకేతం.

దీని కారణంగా కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురి అవ్వడమే కాకుండా, మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు.

తులసి చెట్టులో ఇలాంటి ఆకస్మిక మార్పులు కలగడం వల్ల ఇలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఇందువల్లనే తులసి చెట్టును దైవంగా భావించి పూజలు చేయాలి.ప్రతిరోజు ఉదయం పసుపు కలిపిన నీటిని తులసి చెట్టుకు పోసి, కొద్దిగా పసుపు ,కుంకుమ ను తులసి చెట్టుకు సమర్పించి , నెయ్యి దీపం వెలిగించి పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

మా గర్ల్ ఫ్రెండ్స్ ను ఇలాగే ఆట పట్టించేవాళ్లం.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ వైరల్!