Lord Hanuman : ఏపీలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంఖుస్థాపన.. ఏ జిల్లాలో అంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో హనుమంతుని ( Hanuman )భక్తులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఏపీలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉండగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు ఆ దేవాలయాలను దర్శించుకుంటారు.

ఏపీలోని శ్రీకాకుళం( Srikakulam In AP ) జిల్లాలో 17 సంవత్సరాల క్రితం హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఆ విగ్రహం కంటే ఎత్తైన విగ్రహం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరంలో ఏర్పాటు కానుంది.

ఈ విగ్రహం కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు( 10 Crore Rs ) చేస్తున్నారని తెలుస్తోంది.

గణపతి సచ్చిదానంద స్వామి( Ganapati Satchidananda Swami ) ఈ విగ్రహానికి శంఖుస్థాపన చేశారు.

మహావీర్ హనుమాన్ ట్రస్ట్( Mahavir Hanuman Trust ) ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణానికి శంఖుస్థాపన జరగడం గమనార్హం.

ఈ విగ్రహం ఏర్పాటైన తర్వాత ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

178 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. """/" / ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరు కాగా హనుమంతుడిని పూజించడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలు తీరడంతో పాటు దేవుని అనుగ్రహం మనపై ఉంటుందని చాలామంది ఫీలవుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 215 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.

"""/" / హనుమంతుడిని పూజించడం ద్వారా సమస్యలు సులువుగా తొలగిపోతాయని ఆనందం, శ్రేయస్సు పొందవచ్చని భక్తులు ఫీలవుతారు.

హనుమంతునికి తమలపాకులు సమర్పించడం ద్వారా మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు నమ్ముతారు.

హనుమంతుడిని పూజించే సమయంలో శరీరం, మనస్సు స్వచ్చంగా ఉండేలా చూసుకోవడంతో పాటు 21 అరటిపండ్లను మంగళవారం రోజున భగవంతుని దగ్గర పెట్టి కోతులకు ప్రసాదంగా ఇస్తే మంచిది.

హనుమంతుడి విగ్రహం దగ్గర తీసుకున్న సింధూరాన్ని సీతమ్మ పాదాల దగ్గర పూయడం ద్వారా జీవితంలో మరింత అనుకూల ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?