టక్ జగదీష్ చిత్రంలో నాని తల్లి పాత్రలో నటించిన నటి గురించి తెలిస్తే అవాక్కవుతారు...

ఇటీవలే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని "టక్ జగదీశ్" అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ "రీతూ వర్మ" హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, బిందు చంద్రమౌళి, రావు రమేష్, నరేష్, పార్వతి.

టి, నాజర్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అలాగే ఈ చిత్రానికి నిన్ను కోరి మూవీ ఫేమ్ దర్శకుడు "శివ నిర్వాణ" దర్శకత్వం వహించాడు.

మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల చేయడంతో హీరో నాని అభిమానులు కొంతమేర నిరాశకు గురయ్యారు.

అయితే ఈ చిత్రంలో నాని తల్లి పాత్రలో నటించిన ప్రముఖ సీనియర్ నటి పార్వతి.

టి గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.నటి పార్వతి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పుట్టి పెరిగింది.

అలాగే తిరువనంతపురంలోని ఓ ప్రముఖ కాలేజీలో సైకాలజీ కి సంబంధించిన డిగ్రీని పూర్తి చేసింది.

అంతేకాకుండా సైకాలజీలో ఎం.ఫిల్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పాటు తాను చదివిన కాలేజీలోనే వైస్ చైర్ పర్సన్ గా పని చేసింది.

అంతటితో ఆగకుండా కేరళ అకాడమీ కాలేజీలో ఎల్.ఎల్.

బి చవు దుకూడా పూర్తి చేసింది.ఆ తర్వాత సినిమాల పై మక్కువ కలగడంతో 2007వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు "షాజీ కైలాస్" దర్శకత్వం వహించిన "టైమ్" అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది.

అయితే ఇప్పటి వరకు నటి పార్వతి మలయాళం, తమిళం, భాషల్లో ఎక్కువగా నటించింది.

ఈ క్రమంలో దాదాపుగా 100 కి పైగా చిత్రాలలో తన నటనా ప్రతిభను కనబరిచి నటనా రంగంలో ప్రధానం చేసేటువంటి పలు అవార్డులను కూడా అందుకుంది.

కానీ ఇప్పటివరకు నటి పార్వతి తెలుగు భాషలో మాత్రం కేవలం రెండు చిత్రాలలో మాత్రమే నటించింది.

"""/"/ అలాగే నటి పార్వతి కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.

అంతేకాకుండా పలు కాంపిటీషన్ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించింది.ప్రస్తుతం దాదాపుగా పదికి పైగా తమిళం మరియు మలయాళం చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

అయితే తెలుగులో టక్ జగదీశ్ చిత్రం మంచి హిట్ అవ్వడంతో నటి పార్వతి టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి కూడా సినిమా ఆఫర్లు బాగానే తలుపు తడుతున్నట్లు సమాచారం.

ఇక నటి పార్వతి ఫ్యామిలీ విషయానికి వస్తే "సతీషన్" అనే ప్రభుత్వ ఉద్యోగిని అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి నటి పార్వతి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నట్లు సమాచారం.

నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!