శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజు నుంచి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
TeluguStop.com
ప్రతిరోజు తిరుమల దేవస్థానానికి ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
రాబోయే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు టిటిడి ముఖ్య అధికారులు వెల్లడించారు.
మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
"""/"/ అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్ లైన్ లక్కీ డ్రా నిర్వహించనున్నారు ఈ లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు నిర్దేశిత రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
టీటీడీ ఆర్జిత సేవలో ఉంజాల సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తిరుమలలో అక్రమల నివారణకు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
శ్రీవారి సర్వదర్శనం, లడ్డు ప్రసాదం, గదుల కేటాయింపు రిఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
మార్చి నెల 1వ తేదీ నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. """/"/
ఆర్జిత సేవ టికెట్ల బుకింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
అక్కడ మొబైల్ నెంబర్ నమోదు చేసి, జనరేట్ ఓటిపి ని క్లిక్ చేయడంతో మొబైల్ కి వచ్చిన ఓటిపిని ఎంటర్ చేస్తే టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్ ఓపెన్ అవుతాయి.
మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకుని ఆన్ లైన్ లో మనీ పేమెంట్ చేయాలి.
నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది… అల్లు అర్జున్ పోస్టు వైరల్!