టీటీడీ విజిలెన్స్ విభాగానికి చిక్కిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి

టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పట్టుబడ్డారు.డబ్బులు తీసుకుని స్వామివారి దర్శనానికి సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఫోర్జరీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు నిర్ధారించారు.

నెల రోజుల వ్యవధిలోనే సుమారు 19 సిఫార్సు లేఖలను ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ఇచ్చినట్లు తెలుస్తోంది.

తరచూ భక్తులను తీసుకువస్తున్న ఎమ్మెల్సీ ఇవాళ కూడా ఆరుగురు భక్తులకు వీఐపీ దర్శనం చేయించారు.

దీంతో అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు ఆధార్ కార్డులను తనిఖీ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

ఆధార్ కార్డులను ట్యాంపర్ చేయడంతో పాటు ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమ అయినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ సాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!