శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు తిరుమల శ్రీవారి సర్వదర్శనం ప్రక్రియను టీటీడీ నిలిపి వేసిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే టిటిడి వెబ్ సైట్ లో శీఘ్ర దర్శనం (రూ.300) బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పించింది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఆన్ లైన్ లో వర్చ్యువల్ బుక్ చేసుకునే అవకాశం టిటిడి కల్పించింది.

అయినా సామాన్య ప్రజలు ఈ సేవలను వినియోగించుకోలేక శ్రీవారి దర్శనానికి దూరం అయ్యారు.

అయితే తాజాగా టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.టీటీడీ కొన్ని జిల్లాల్లో ఆలయాలను నిర్మిస్తున్న నేపథ్యంలో అక్కడ వెనకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా స్వామి వారి దర్శనం చేయించేందుకు సంకల్పించింది.

అందుకు టీటీడీ బస్సుల్లోనే భక్తులను తీసుకెళ్లి ఉచితంగా సర్వదర్శనం కల్పిస్తుంది.ఈ విషయాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ అక్టోబర్ నెలలో 7 నుండి 15 వ తేదీల మధ్య శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లను, విధివిధానాలను సిద్ధం చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.అయితే ఈ సందర్బంగా 500 నుండి 1000 మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

"""/"/ దీంతో పాటు అక్టోబర్ కు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా అలిపిరి మార్గాన్ని కూడా కాలి నడకన వచ్చే శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తీస్కురావాలని టిటిడి నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమావేశంలో ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు.

మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!