ఆ టికెట్లు లేని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. దయచేసి రావద్దంటూ..!
TeluguStop.com
ప్రతి భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారి అయినా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy )ని దర్శించుకోవాలని కోరుకుంటాడు.
తిరుమలలోని శ్రీవారి దర్శనం చేసుకుంటే తన జీవితం ధన్యమవుతుందని అనుకుంటాడు.అలాగే తాము చేసిన పాపాలు మొత్తం పోతాయని శ్రీవారి భక్తుల నమ్మకం.
ఇదే జగమెరిగిన సత్యం అని ఎన్నోసార్లు రుజువైంది.అయితే ప్రస్తుతం తిరుమల ( Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది.
శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.
అయితే వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో నిండిపోయింది.
అయితే శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 30 గంటల సమయం పడుతుంది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యనవనాలతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
అలాగే శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం అందించారు. """/" /
అలాగే ఆరోగ్య విజిలెన్స్ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి లతో సేవలందించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయం( Matrusree Tarigonda Vengamamba Anna Prasada Samudaya )లోని శనివారం మధ్యాహ్నం సమయంలో దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించారు.
అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ లలో 80 వేల మందికి అన్నప్రసాదాలతో పాటు ఉప్మా, పొంగల్ పంపిణీ చేయడం జరిగింది.
"""/" /
అయితే సాధారణంగా ప్రతిరోజు కంటే శనివారం రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించడం జరిగింది.
అలాగే పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందించారు.జరగకుండా టీటీడీ విజిలెన్స్ పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.