ఇంజనీర్ పై బురద చల్లిన కాంగ్రెస్ నేత

ఇటీవల బీజేపీ నేత ఒకరు ప్రభుత్వ అధికారిపై బ్యాటు తో దాడి చేసిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.

ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ)డిప్యూటీ ఇంజనీర్ పై కాంగ్రెస్ శాసనసభ్యుడు తో పాటు ఆయన అనుచరులు బురద పోసిన ఘటన చోటుచేసుకుంది.

ముంబయి-గోవా జాతీయ రహదారిపై గుంతలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా కణకావలీ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు నీతేశ్‌ రాణె, కణకావలీ పురపాలక సంఘం ఛైర్మన్‌ సమీర్‌ నలవాడేలు ఆగ్రహానికి గురై తమ అనుచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు.

డిప్యూటీ ఇంజినీర్‌ ప్రకాశ్‌ షెడేకర్‌పై వారి అనుచరులు రెండు బకెట్లతో బురద పోసి, అనంతరం షెడేకర్‌ను వంతెనకు కట్టేసేందుకు కూడా యత్నించినట్లు తెలుస్తుంది.

"""/"/ దీనితో నితేశ్ తో పాటు ఆయన అనుచరులు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కణకావలీ వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.మరోపక్క నీతేశ్‌ రాణె నిర్వాకం పట్ల ఆయన తండ్రి నారాయణ్‌ రాణె క్షమాపణలు తెలిపారు.

మాజీ సీఎం అయిన నారాయణ్‌.ప్రస్తుతం భాజపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!