టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఇవాళ మరోసారి నిందితుల విచారణ
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా ప్రధాన నిందితులను ఈడీ అధికారులు ఇవాళ మరోసారి విచారించనున్నారు.
కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను నిన్న చంచల్ గూడ్ జైలులో దాదాపు 5 గంటల పాటు అధికారులు విచారించారు.
అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏ మేరకు నిధులు చేతులు మారాయనే దానిపై ఆరా తీస్తోంది.
Validation Check 2026-03-24 19:38:18