రవాణాశాఖలో 113 పోస్టులు - నవంబర్‌లో ఆన్‌లైన్‌లో రాత పరీక్ష

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడిం ది.రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నెల రోజుల పాటు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

అభ్యర్థులకు నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.దీనిని ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలను హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ తెలిపారు.

పూర్తి వివరాలకు !--wwwtspsc.gov!--in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

H3 Class=subheader-style అర్హతలు – సడలింపుల వివరాలు: ---------------------------------/h3p అభ్యర్థులు 21-39 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఐదేండ్లు, ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్‌ సర్వీసు పొందిన నాటి నుంచి ఐదేండ్ల పాటు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

లేదా మూడేండ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసినా అర్హులే.

దరఖాస్తుదారులు చెల్లుబాటయ్యే హెవీ మోటర్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ట్రాన్స్‌పోర్ట్‌) పొంది ఉండాలి.

పురుషులు కనీస ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతీ 86.3 సెంటీమీటర్లు కలిగి ఉండాలి.

గాలిపీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు విస్తరించాలి.ఎస్సీ, ఎస్టీలకు ఎత్తు 160 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు.

ఛాతీ 83.80 సెంమీటర్లు ఉండాలి.

గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి.మహిళలు ఎత్తు 157.

5 సెంటీమీటర్లు, ఛాతీ 82.30 సెంటీమీటర్లు ఉండాలి.

గాలిపీల్చినప్పుడు ఛాతి 5 సెంటీమీటర్లు విస్తరించాలి.ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు ఎత్తు 152.

5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.ఛాతీ 79.

80 సెంటీమీటర్లు ఉండాలి.గాలిపీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి.

దరఖాస్తుదారులు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.200, ఎగ్జామ్‌ ఫీజుగా రూ.

120 చెల్లించాలి.నిరుద్యోగులకు ఎగ్జామ్‌ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దేవర 100 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. వామ్మో అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడిందా?