ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సుప్రీంకు టీఎస్ సర్కార్..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనంలో సర్కార్ సవాల్ చేయనుంది.

కేసు విచారణను సీబీఐకు అప్పగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పు తమ పరిధిలోకి రాదని తెలిపింది.

అనంతరం సర్కార్ పిటిషన్ ను కొట్టివేసింది.డివిజన్ బెంచ్ తీర్పుతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సుప్రీంకు వెళ్లేంత వరకు సీబీఐ విచారణ నిలిపివేయాలని సర్కార్ కోర్టును కోరింది.అయితే ప్రభుత్వ వినతిని హైకోర్టు నిరాకరించింది.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ ఏ క్షణంలోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

ఇందులో భాగంగానే కేసు వివరాలు ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ కు సీబీఐ లేఖ రాసింది.

వస్తావా అంటే అర్థం తెలియక సరే అన్నా.. ఎక్కడెక్కడో టచ్ చేసేవారు.. కీర్తి భట్ షాకింగ్ కామెంట్స్!