గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు టీఎస్ హైకోర్టు నిరాకరణ
TeluguStop.com
తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు పరీక్షలు వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.
రెండు లక్షల విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయలేమంది.ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అలాంటి వాళ్లకు మాత్రమే పవన్ గుండెల్లో స్థానం.. ఎస్జే సూర్య క్రేజీ కామెంట్స్ వైరల్!