బట్టతలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ రెమెడీ మీకే!
TeluguStop.com
బట్టతల.ప్రస్తుత రోజుల్లో పురుషులను తీవ్రంగా మదన పెడుతున్న సమస్య ఇది.
ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేసే వారికి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది.
దాంతో రోజూ ఊడిపోయే జుట్టును చూసుకుంటే ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని బెంగ పెట్టేసుకుంటారు.
అందులోనూ పెళ్లి కాని యువకులైతే.ఇక వారి బాధ వర్ణణాతీతమే.
అయితే ఇకపై చింతించకండి.ఎందుకుంటే.
ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
మరియు బట్టతకు దూరంగా కూడా ఉండొచ్చు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబల్ స్పూన్ల లవంగం పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ నల్ల బియ్యం, హాఫ్ టేబుల్ స్పూన్ పోక చెక్క పొడి వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు హీట్ చేయాలి.
వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ స్టైనర్ సాయంతో సపరేట్ చేసి.
అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆ వాటర్‌ను స్ప్రే బాటిల్ లో నింపి.