ఈ హెయిర్ మాస్క్‌ను వేసుకుంటే పురుషులు బ‌ట్ట‌త‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ట‌

ప్ర‌స్తుత రోజుల్లో పురుషుల‌ను ప్ర‌ధానంగా క‌ల‌వ‌ర పెడుతున్న స‌మ‌స్య బ‌ట్ట‌త‌ల‌.ఒక వయస్సు వచ్చిన తర్వాత జుట్టు క్ర‌మంగా రాలిపోయి బ‌ట్ట‌త‌ల రావ‌డం స‌ర్వ సాధార‌ణం.

కానీ, ఇప్ప‌టి కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

కంప్యూట‌ర్లు, ఫోన్ల‌తో ఎక్కువ స‌మ‌యం పాటు గ‌డ‌ప‌టం, పోష‌కాల కొర‌త‌, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, ఆహార‌పు అల‌వాట్లు, టెస్టోస్టిరాన్‌లో మార్పులు, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌ట్ట‌త‌ల ఏర్ప‌డుతుంటుంది.

అయితే బ‌ట్ట‌త‌ల వ‌చ్చాక బాధ‌ప‌డ‌టం కంటే రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే ఎంతో ఉత్త‌మం.

కాబ‌ట్టి, ఎవ‌రైతే బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవాల‌ని భావిస్తున్నారో.అలాంటి వారికి ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ మాస్క్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ మాస్క్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి ముక్క‌లు, గుప్పెడు క‌రివేపాకు, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల అర‌టి పండు పేస్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

న‌ల‌బై లేదా అర‌వై నిమిషాల అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

పురుషులు వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్‌ను వేసుకుంటే జుట్టు కుదుళ్ల‌కు బ‌లం చేకూరి ఊడ‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

నీ అవ్వ తగ్గేదేలే అంటూ.. ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్