ఎండల వల్ల స్కిన్ డల్ గా మారిందా.. ఇన్‌స్టంట్ గ్లో కోసం ఇది ట్రై చేయండి!

ఎండలు( Sun ) మండిపోతున్నాయి.భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.ఈ వేసవికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో చర్మాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టతరంగా మారుతుంటుంది.

ఎండలు, అధిక వేడి కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి.ముఖ్యంగా చాలా మంది స్కిన్ తరచూ డల్ గా మారుతుంటుంది.

కాంతిహీనంగా మరియు నిర్జీవంగా కనిపిస్తుంది.అటువంటి చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక హైరానా పడిపోతుంటారు.

కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఇన్‌స్టంట్ గ్లో మీ సొంతమవుతుంది.

మరి ఇంతకీ డల్ స్కిన్ ను మాయం చేసే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టమాటో స్లైసెస్,( Tomato Slices ) ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Soil ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.

అలాగే టమాటో పుదీనా జ్యూస్( Mint Juice ) కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో చర్మాన్ని సున్నితంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

టాన్ రిమూవ్ అవుతుంది.చర్మం క్షణాల్లో కాంతివంతంగా మరియు అందంగా మారుతుంది.

స్కిన్ డల్ నెస్ ఎగిరిపోతుంది.కాబట్టి ఇన్‌స్టంట్ గ్లో పొందాల‌నుకునేవారు, డల్ స్కిన్ కు బై బై చెప్పాలనుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ రెమెడీని ఫాలో అవ్వండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఓ మంచి ఘోస్ట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్?