ఎన్ని షాంపూలు మార్చిన చుండ్రు పోవడం లేదా.. అయితే ఇది ట్రై చేయండి!
TeluguStop.com
చుండ్రు( Dandruff ) అనేది చాలా మందిని చాలా కామన్ గా వేధించే సమస్య.
అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో చుండ్రు సమస్య ఇంకా అధికంగా ఇబ్బంది పడుతుంటుంది.ఈ క్రమంలోనే చుండ్రు పోగొట్టుకునేందుకు ఎన్నెన్నో షాంపూలు వాడుతుంటారు.
కానీ కొందరిలో ఎన్ని షాంపూలు మార్చిన చుండ్రు మాత్రం పోదు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో బాగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే శాశ్వతంగా చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.
అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. """/" /
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మొదటి రోజు నానబెట్టుకున్న మెంతుల( Soaked Fenugreek Seeds ) గిన్నెను స్టవ్ పై పెట్టి పది నిమిషాల పాటు ఉడికించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onion ) అర కప్పు కలబంద( Aloevera ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
"""/" /
ఈ ఉల్లిపాయ కలబంద జ్యూస్ లో మెంతుల వాటర్ మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఒక మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.
స్కాల్ప్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.ఉల్లిపాయ, కలబంద, మెంతులు మరియు ఆముదం ఇవి జుట్టుకు పోషణ అందిస్తాయి.
మూలాల నుంచి జుట్టును దృఢంగా మారుస్తాయి.జుట్టు రాలడాన్ని సైతం అరికడతాయి.
ఈ రెస్టారెంట్ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?