మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఇలా ట్రైచేసి చూడండి ఒకసారి!

ఈ స్మార్ట్ యుగంలో సగటు మానవుడికి ఇంటర్నెట్​ లేకపోతే గడవని పరిస్థితి.అదెలాగంటే అంతర్జాలం అనేది నేడు దైనందిత జీవితంలో ఒక భాగం అయిపోయింది.

ఛాటింగ్ నుండి మీటింగ్, బ్యాంకింగ్ వరకు.అన్నింటికీ కావాల్సింది ఇంటర్నెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

అయితే చాలామంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నపుడు స్పీడ్ విషయంలో ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు.

స్లో ఇంటర్నెట్​ వల్ల చాలా మంది నిత్యం ఇబ్బందులు పడుతుంటారు.అయితే ఇంటర్నెట్​ స్పీడ్​ను పెంచుకునేందుకు పలు టిప్స్ వున్నాయి.

అవి చక్కగా ఫాలో అయితే ఆ సమస్యను అధిగమించవచ్చు.క్రోమ్​ వంటి బ్రౌజర్స్​కు సంబంధించి 'లైట్​' వర్షెన్​ను వాడితే బావుంటుంది.

రెగ్యులర్​ వర్షెన్​తో పోల్చుకుంటే ఈ లైట్​ వర్షెన్​లో డేటా కూడా సేవ్​ అవుతుంది.

ఇంటర్నెట్​ స్లో ఉన్నా వెబ్​ పేజ్​లను వేగంగా యాక్సెస్​ చేసుకోవచ్చు.అనవసరంగా ట్యాబ్స్​ను ఓపెన్ చేయొద్దు.

ఎందుకంటే, వెబ్​పేజ్​లు, ట్యాబ్​లు బ్యాక్​గ్రౌండ్​లో ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటాయి.వీటికి ఇంటర్నెట్ వాడకం జరుగుతుంది.

అందుకే, అనవసరమైన ట్యాబ్స్​ను, వెబ్​పేజ్​లను ఊరికే ఓపెన్ చేయొద్దు. """/"/ అలాగే మీ ఇంట్లో ఎక్కడైతే ఇంటర్నెట్ బాగా వస్తుందో అక్కడ వైఫై రౌటర్​ను ఏర్పాటు చేసుకోండి.

తక్కువ డివైజ్​లు కనెక్ట్ చేసుకోండి.మీ ఇంటర్నెట్​ సోర్స్​కి.

ఎంత తక్కువ డివైజ్​లు కనెక్ట్​ అయ్యి ఉంటే అంత మేలని గుర్తించుకోండి.ఇక చివరగా వీడియో స్ట్రీమింగ్​ చేసేటప్పుడు స్లో ఇంటర్నెట్​ ఉంటే.

వీడియో స్ట్రీమింగ్​ రిసొల్యూషన్​ను కాసేపు తగ్గించుకోండి.ఫలితంగా బఫరింగ్​ టైమ్​ తగ్గే అవకాశం ఉంటుంది.

ఇక్కడ పేర్కొన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఇంటర్నెట్ స్పీడు అనేది స్టేబుల్ గా ఉంటుంది.

చిరంజీవితో అకీరా ఫస్ట్ సినిమా… మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!