ఈ చిట్కాను ట్రై చేస్తే పైసా ఖ‌ర్చు లేకుండా జుట్టును ద‌ట్టంగా పెంచుకోవ‌చ్చు!

జుట్టు ద‌ట్టంగా ఉంటే.చూపురుల‌కు అందంగా ఉంటుంది.

అందుకే ఒత్తైన జుట్టు కావాల‌ని అంద‌రూ తెగ ఆరాట‌ప‌డుతుంటారు.అందుకోసం ఖ‌రీదైన షాంపూలు, నూనెలు, సీర‌మ్స్ ఇలా ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు.

కొంద‌రైతే జుట్టు ఒత్తుగా పెర‌గ‌డానికి ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే ద‌ట్ట‌మైన జుట్టును త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాను ఏంటో తెలుసుకుని ట్రై చేస్తే పోలా.

ముందుగా అంగుళం అల్లం ముక్క‌ను తీసుకుని పొట్టు తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

ఆ త‌ర్వాత ఒక నిమ్మ పండును తీసుకుని పై పీల్ మాత్రం వ‌చ్చేలా తురుముకోవాలి.

అలాగే మిక్సీ జార్‌లో అర క‌ప్పు ల‌వంగాల‌ను వేసి మెత్త‌గా పొడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని ఒక క‌ప్పు ఆలివ్‌ నూనె లేదా కొబ్బ‌రి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోవాలి.

"""/" / అలాగే అందులో అల్లం తురుము, నిమ్మ తొక్క‌ల తురుము, గ్రైండ్ చేసి పెట్టుకున్న ల‌వంగాల పొడి వేసి బాగా క‌లిపి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఇలా ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకుని.అప్పుడు ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో నూనెను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ వారం నుంచి ప‌ది రోజుల పాటు నిల్వ ఉంటుందిరాత్రి నిద్ర‌పోయే ముందు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని.

కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా నాలుగు రోజుల‌కు ఒక‌సారి చేస్తే మీ జుట్టు ద‌ట్టంగా, బ‌లంగా పెరుగుతుంది.