చాలా వీక్ గా ఉన్నారా.. బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ షేక్ మీకే..!

సాధారణంగా కొందరు ఉండాల్సిన బరువు( Weight ) కంటే చాలా తక్కువగా ఉంటారు.

దీని వల్ల ఎప్పుడు వీక్ గా కనిపిస్తుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే బరువు పెరగడానికి, వీక్ నెస్ ను పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే సత్తు బ‌నానా షేక్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పొట్టు తొలగించిన వేపుడు శనగలు ( Roasted Peanuts )వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు( Milk ), ఒక అరటిపండు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము( Jaggary Powder ), రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.

వీటితో పాటు చిటికెడు యాలకులు పొడి కూడా వేసి మెత్తగా బ్లెండింగ్ చేసుకుని గ్లాస్ లోకి పోసుకోవాలి.

ఇప్పుడు ఈ సత్తు షేక్ లో బాదం, జీడిపప్పు, పిస్తా( Almonds, Cashews, Pistachios ) పలుకులు వేసి తాగేయడమే.

"""/" / ఈ సత్తు బ‌నానా షేక్ చాలా రుచికరంగా ఉంటుంది.ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను సేకరిస్తుంది.

ముఖ్యంగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాల‌ని భావించే వారికి ఈ షేక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఈ స‌త్తు బ‌నానా షేక్ కొంత కొవ్వు మ‌రియు మంచి మొత్తంలో ప్రోటీన్ ను క‌లిగి ఉంటుంది.

ఇవి కండరాల పెరుగుదలకు, మరమ్మతుకు మ‌రియు శరీరం బలపడటానికీ ఉపయోగపడుతుంది.రోజు ఉదయాన్నే లేదా వర్కౌట్ తర్వాత ఒక గ్లాసు సత్తు బనానా షేక్ తాగితే చ‌క్క‌గా బ‌రువు పెరుగుతారు.

వీక్‌నెస్ ఎగిరిపోతుంది.సూప‌ర్ స్ట్రోంగ్ గా మార‌తారు.

"""/" / అంతేకాదండోయ్‌.ఈ సత్తు బ‌నానా షేక్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్ లో రెగ్యుల‌ర్ గా ఈ షేక్ ను తీసుకుంటే సత్తు శరీరాన్ని శీతలీకరించి, హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది.

అరటి పండు సహజ చక్కెరలను కలిగి ఉండడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది.

నీర‌సం, అల‌స‌ట ద‌రిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.