రెండు స్పూన్ల బియ్యంతో సూపర్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందండిలా..!

ముఖ చర్మం తెల్లగా( Skin Is White ) కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని రకరకాల క్రీములు వాడుతుంటారు.

ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.ఇక ప్రతి నెలా బ్యూటీ పార్లర్ లో పెట్టే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కానీ పైసా ఖర్చు లేకుండా వంటింట్లో ఉండే బియ్యంతో సూపర్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు అని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Spoons Of Rice ) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.

ఆపై అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), పావు టీ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టీ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ టీ స్పూన్ గులాబీ రేకుల పొడి వేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి కేవలం రెండుసార్లు ఈ రైస్ మాస్క్ ను కనుక వేసుకుంటే అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

"""/" / ముఖ్యంగా ఈ మాస్క్ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది, చనిపోయిన చర్మ కణాలను తొలగించి, ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని అందిస్తుంది.

అలాగే ఈ రైస్ మాస్క్ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.

సూపర్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు తేమను నిలుపుకోవడానికి ఈ మాస్క్ సహాయపడుతుంది.

చర్మంపై అదనపు నూనెను కూడా గ్రహించి ఫ్రెష్ స్కిన్ ను అందిస్తుంది.