జుట్టు నుంచి చెడు వాసన వస్తుందా.. ఈ టిప్ తో ప్రాబ్లం సాల్వ్!
TeluguStop.com
ఒక్కోసారి జుట్టు నుంచి చెడు వాసన( Smelly Hair ) వస్తుంటుంది.చెమట, బ్యాక్టీరియా, చుండ్రు, తడి జుట్టుతో నిద్రపోవడం, తలస్నానం చేయకపోవడం, పర్యావరణ కాలుష్య కారకాలు చేరడం తదితర కారణాల వల్ల జుట్టు నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది.
అయితే ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేసుకోవడానికి రెగ్యులర్ పద్ధతిలో షాంపూ చేసుకుంటే సరిపోదు.
షాంపూ సమయంలో ఇప్పుడు చెప్పబోయే టిప్ ను పాటిస్తే బ్యాడ్ స్మెల్ దూరం అవ్వడంతో పాటు జుట్టు హెల్తీగా, షైనీగా సైతం మారుతుంది.
"""/" /
అందుకోసం ముందుగా ఒక కలబంద( Aloevera ) ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, గుప్పెడు గులాబీ రేకులు,( Rose Petals ) వన్ టీ స్పూన్ టీ పొడి, ఐదు లవంగాలు వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి.
"""/" /
ఈ వాటర్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను మిక్స్ చేసి హెయిర్ వాష్ కు ఉపయోగించాలి.
ఈ విధంగా కనుక షాంపూ చేసుకుంటే చెడు వాసన దూరమై అన్నివేళలా జుట్టు నుంచి మంచి సువాసన వస్తుంది.
తల చర్మం మరియు జుట్టు శుభ్రంగా, ఆరోగ్యంగా మారతాయి.అలాగే ఇప్పుడు చెప్పుకున్న విధంగా షాంపూ చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.
జుట్టు రాలే సమస్య తగ్గు ముఖం పడుతుంది.కురులు హైడ్రేట్ గా మారతాయి.
అదే సమయంలో చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నుంచి సైతం విముక్తి పొందవచ్చు.