పెళ్లి వేళ ముఖం మెరిసిపోవాలంటే ఈ రెమెడీని ట్రై చేయాల్సిందే!

బంధువుల్లో ఎవరిదైనా పెళ్లికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వారం రోజుల ముందు నుంచే చర్మం పై శ్రద్ధ వహిస్తుంటారు.

ఇక అదే పెళ్లి మనదైతే మరింత శ్రద్ధ పెడుతుంటారు.ముఖ్యంగా మగువలు పెళ్లిలో అందంగా కనిపించాలని తెగ ఆరాటపడుతుంటారు.

ఈ క్రమంలోనే ఖ‌రీదైన క్రీములు, ఫేస్ మాస్కులు వాడుతుంటారు.బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్‌, స్కిన్ బ్లీచింగ్ వంటివి చేయించుకుంటారు.

కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఈ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల‌ను తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజ‌ల పొడిని వేసుకోవాలి.

అలాగే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వ‌న్‌ టేబుల్ స్పూన్ లెమన్ ఫీల్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా సరిపడా రోజ్ వాటర్‌ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్ర‌ష్‌ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/"/ పూర్తిగా డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

రోజుకి ఒకసారి ఈ రెమెడీని పాటించాలి.పెళ్లికి పది రోజుల ముందు నుంచి ఈ సింపుల్ రెమెడీని ఫాలో అయితే ముఖంపై ముదురు రంగు మచ్చల‌న్నీ మాయం అవుతాయి.

స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.మరియు పెళ్లి వేళ చర్మం అందంగా, ప్రకాశవంతంగా సైతం మెరుస్తుంది.

అలా జరిగితే బన్నీ నంబర్ వన్ హీరో అవుతారా.. అసలేం జరిగిందంటే?