పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ రెమెడీని ప్రయత్నించండి!
TeluguStop.com
వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడుతుంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి వేలకు వేలు ఖర్చుపెట్టి క్రీమ్, సీరం తదితర చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా తెల్లటి మరియు మచ్చలేని చర్మాన్ని( Spotless Skin ) పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
అది ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు బీట్ రూట్ స్లైసెస్( Beetroot Slices ) వేసుకోవాలి.
అలాగే మూడు టమాటో స్లైసెస్,( Tomato Slices ) మూడు పీల్ తొలగించిన బంగాళదుంప స్లైసెస్( Potato Slices ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బీట్ రూట్, పొటాటో, టమాటో జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక ప్రయత్నిస్తే చర్మం పై ఎటువంటి మచ్చలు ఉన్న తగ్గు ముఖం పడతాయి.
స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మారుతుంది.
కొద్ది రోజుల్లోనే స్పాట్ లెస్ అండ్ వైట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.
ఆయిల్ కంట్రోల్ అవుతుంది.తరచూ మొటిమలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
అంతేకాకుండా ఈ రెమెడీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.టాన్ ను సైతం రిమూవ్ చేస్తుంది.
పుష్ప 2 సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!