వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం, ముఖం మొత్తం తెల్ల‌గా ఉంటుంది.కానీ, మెడ మాత్రం న‌ల్ల‌గా క‌నిపిస్తుంటుంది.

అందులోనూ ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఈ స‌మ‌స్య‌ చాలా మందిని తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటుంది.

ఎండ‌ల ప్ర‌భావం, ఒంట్లో అధిక వేడి, చెమ‌ట వ‌ల్ల దుమ్ము ధూళి పేరుకుపోవ‌డం, మృత క‌ణాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల తెల్ల‌గా ఉండాల్సిన మెడ న‌ల్ల‌గా త‌యారవుతుంది.

మెడ‌ న‌ల్ల‌గా ఉంటే ముఖం ఎంత అందంగా ఉన్నా కాంతిహీనంగానే క‌నిపిస్తుంది.అందుకే మెడ‌ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని వారంలో రెండంటే రెండు సార్లు ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం అవ్వ‌డం కాయం.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మ‌కాయంత చింత‌పండు మ‌రియు వాట‌ర్ వేసుకుని నాన‌బెట్టుకోవాలి.

గంట త‌ర్వాత నాన‌బెట్టుకున్న చింత‌పండును మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ ఎగ్ వైట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల షుగ‌ర్ వేసుకుని ఒక‌సారి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో చింత‌పండు పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా క‌లుపుకున్న‌ మిశ్ర‌మాన్ని మెడ‌కు ప‌ట్టించి ఓ ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై వేళ్ల‌తో సున్నితంగా కాసేపు స్క్ర‌బ్ చేసుకుని.అప్పుడు వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మెడ న‌లుపు క్ర‌మంగా వ‌దిలిపోతుంది.

యంగ్ హీరోలందరూ మాస్ హీరో అవ్వాలనుకుంటున్నారా..?