హెయిర్ రీ గ్రోత్ టానిక్ ఇది.. ఒక్కసారి వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది!

హెయిర్ ఫాల్.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఈ స‌మ‌స్య ఉంటుంది.

అయితే కొందరిలో జుట్టు ఊడుతుంది.కానీ మళ్ళీ రాదు.

దీని కారణంగా కురులు పల్చగా మారిపోతుంటాయి.మీరు ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నారా.

అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ రీ గ్రోత్ టానిక్ ను మీరు కచ్చితంగా వాడాల్సిందే.

వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ రీ గ్రోత్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు బిర్యానీ ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ రైస్ వాటర్ లో ఒక కప్పు ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ రీ గ్రోత్ టానిక్ సిద్ధం అవుతుంది. """/" / ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే హెయిర్ గ్రోత్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది.హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతాయి.

అలాగే ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా పొడుగ్గా మారతాయి.

కాబట్టి జుట్టు అధికంగా ఊడుతుందని బాధపడుతున్న వారు, ఊడిన జుట్టు మళ్ళీ రావడం లేదని సతమతం అవుతున్నవారు కచ్చితంగా ఈ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.