జుట్టు ఆరోగ్యానికి అండగా నిలిచే బెస్ట్ ప్రోటీన్ మాస్క్ ఇది.. నెలలో ఒక్కసారైనా ట్రై చేయండి!
TeluguStop.com
మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి.మన బాడీ ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉండాలంటే నిత్యం ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం ఎంతో అవసరం.
అయితే శరీరానికే కాదు జుట్టుకు( Hair ) కూడా ప్రోటీన్ చాలా అవసరం.
ప్రోటీన్ అందితేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోవడం తో పాటు ప్రోటీన్ హెయిర్ మాస్కులను కూడా అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ మాస్క్ మీ జుట్టు ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.
అనేక జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా బాగా పండిన ఒక అవకాడో ( Avocado )తీసుకుని సగానికి కట్ చేసి గింజ తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అవకాడో పల్ప్ ను వేసుకోవాలి.
అలాగే ఒక ఫుల్ ఎగ్ ను బ్రేక్ చేసి వేయాలి.ఎగ్ తో పాటుగా వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, అరకప్పు కొబ్బరి పాలు( Aloe Vera Gel, Half A Cup Of Coconut Milk ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
కనీసం నెలలో ఒకసారైనా ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
ఈ ప్రోటీన్ మాస్క్ మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలను అరికడుతుంది.
"""/" /
అలాగే ఈ ప్రోటీన్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.
కురులు సిల్కీగా షైనీ గా మెరుస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన మరియు దృఢమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ ప్రోటీన్ మాస్క్ ను ప్రయత్నించండి.
పుష్ప ది రూల్ బీహార్ ఈవెంట్ పై విమర్శలు చేసిన సిద్దార్థ్.. ఏకంగా ఇంత జరిగిందా?