పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!

పైనాపిల్.( Pineapple ) మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూర్చే అద్భుత పండ్లలో ఒకటి.

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది పైనాపిల్ ను ఇష్టంగా తింటుంటారు.

ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే పైనాపిల్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అయితే పైనాపిల్ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సైతం గ్రేట్ గా సహాయపడుతుంది.

ముఖ్యంగా స్పాట్ లెస్ స్కిన్( Spotless Skin ) కోసం ఆరాటపడే వారికి పైనాపిల్ చాలా అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

"""/" / ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే పైనాపిల్ తో సులభంగా నివారించుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బాగా పండిన పైనాపిల్ ముక్కలు వేసి.

కొద్దిగా రోజ్‌ వాటర్( Rose Water ) పోసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పైనాపిల్‌ ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్( Oats Powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖ చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి ముదురు రంగు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటించండి.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.

దాంతో చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

దేవుడి హుండీలో రూ.20 నోటు వేసి ఏమి కోరుకున్నాడో తెలుస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాలిసిందే