Orange Peel : ఆరెంజ్ తొక్కలు అందాన్నే కాదు జుట్టును పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
TeluguStop.com
పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్( Orange ) ముందు వరుసలో ఉంటుంది.
రుచి పరంగా పోషకాలు పరంగా తనకు తానే సాటి అయిన ఆరెంజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే ఆరెంజ్ పండ్లు తినేటప్పుడు చాలామంది వాటికి ఉండే తొక్కలను ఎండబెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఆరెంజ్ తొక్కల్లో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఆరెంజ్ తొక్కలు అద్భుతంగా తోడ్పడతాయి.
అయితే అందాన్ని మాత్రమే కాదు జుట్టును పెంచడానికి కూడా ఆరెంజ్ తొక్కలు సహాయపడతాయి.
మరి ఇంతకీ జుట్టుకు ఆరెంజ్ తొక్కల్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఎప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న ఆరెంజ్ తొక్కలు మరియు బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉడికించాలి.
"""/" /
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను మాత్రం ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ సిద్ధమవుతుంది.
ఒక స్ప్రే బాటిల్ తయారు చేసుకున్న టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.
ఈ టానిక్ హెయిర్ గ్రోత్ ను పెంచడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
అలాగే జుట్టు రాలడాన్ని సైతం అరికడుతుంది.అదే సమయంలో జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.
స్కాల్ప్ హైడ్రేటెడ్ గా మారుతుంది.కురులు హెల్తీగా షైనీ గా మెరుస్తాయి.
కాబట్టి ఆరోగ్యమైన మరియు ఒత్తైన కురులను కోరుకునేవారు ఆరెంజ్ తొక్కలతో తప్పకుండా ఈ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
ఆరోగ్యానికి వరం తోటకూర గింజలు.. ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!