నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
TeluguStop.com
తమ కురులు నల్లగా ఒత్తుగా( Thick Black Hair ) మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.
కానీ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఎండల ప్రభావం, పోషకాల కొరత, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడటం తదితర అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
పైగా సరైన కేర్ లేకపోవడం వల్ల కొందరికి జుట్టు హెవీ గా రాలిపోతుంటుంది.
ఇంకొందరికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) వచ్చేస్తుంటుంది.అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ఉత్తమంగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) నాలుగు మందార ఆకులు,( Hibiscus ) రెండు గింజ తొలగించిన ఉసిరికాయలు( Amla ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె పోసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం తో పాటు నాలుగు తులసి ఆకులు, నాలుగు మందారం పువ్వులు కూడా వేసి ఉడికించాలి.
దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
"""/" /
వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసిన మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.
ఈ ఆయిల్ జుట్టును దృఢంగా ఆరోగ్యంగా మారుస్తుంది.జుట్టు ఎదుగుదల ను మెరుగుపరుస్తుంది.
కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. """/" /
అలాగే ఈ ఆయిల్ తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేస్తుంది.
కేశాలను నల్లగా నిగనిగలాడేలా మెరిపిస్తుంది.ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
చుండ్రు సమస్య దూరమవుతుంది.జుట్టు షైనీ గా సైతం మెరుస్తుంది.
కాబట్టి నల్లని ఒత్తైన కురుల కోసం తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ట్రై చేయండి.
గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు శంకర్ ఇద్దరు ఒకేసారి ఆ ఫీట్ ను అందుకోబోతున్నారా