జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!
TeluguStop.com
జుట్టు అధికంగా ఊడిపోయి రోజు రోజుకు పల్చగా మారిపోతుందా.? జుట్టు ఎదుగుదలను( Hair Growth ) పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి కేవలం రెండు సార్లు ఈ ఆయిల్ ను తలకు రాశారంటే మీరు కోరుకున్నట్లే మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, మెంతులు మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంటపై దాదాపు 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
"""/" /
అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
జుట్టు ఎదుగుదలకు ఈ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.
"""/" /
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
పల్చటి జుట్టు దట్టంగా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఆరోగ్యమైన ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి.
సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?