నెలలో కేవలం 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ ను ట్రై చేశారంటే మీ జుట్టు నల్లగా, సిల్కీగా మెరిసిపోతుంది!

జుట్టు నల్లగా మరియు సిల్కీగా( Healthy Silky Hair ) మెరిసిపోతూ కనిపించాలని మగువలు తెగ ఆరాటపడుతూ ఉంటారు.

అటువంటి జుట్టును పొందడం కోసం సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ మాస్క్( Natural Hair Mask ) ను ట్రై చేశారంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే జుట్టును నల్లగా మరియు సిల్కీగా మెరిపించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/"/ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి మరిగించాలి.

వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్టైనర్ సహాయంతో ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బాగా పండిన అరటి పండ్లు( Banana ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd )తో పాటు తయారు చేసుకున్న వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

"""/"/ ముఖ్యంగా కురులు నల్లగా సిల్కీగా మెరుస్తాయి.తెల్ల జుట్టు( White Hair ) త్వరగా దరిచేరకుండా ఉంటుంది.

కురులు హైడ్రేటెడ్ గా ఉంటాయి.జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.

దాంతో హెయిర్ ఫాల్ సమస్య సైతం దూరం అవుతుంది.అలాగే చాలామంది తమ జుట్టు తరచూ చిట్లిపోతుందని బాధపడుతూ ఉంటారు.

అలాంటి వారికి కూడా ఈ హెయిర్ మాస్క్‌ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ హెయిర్ మాస్క్ ద్వారా జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

హెయిర్ డామేజ్ తగ్గుతుంది.

ఓరి నాయనో, విడాకులు తీసుకుంటే ఇంత ఘనంగా పార్టీ చేసుకుంటారా..??