ముఖ చర్మం వైట్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ క్రీమ్ మీకోసమే..!
TeluguStop.com
స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) కోసం ఆరాటపడేవారు మనలో ఎంతో మంది ఉన్నారు.
ముఖ్యంగా ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించాలని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
చర్మంపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మీకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
రెగ్యులర్ గా ఈ క్రీప్ ను వాడటం అలవాటు చేసుకుంటే సహజంగానే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి. """/" /
క్రీమ్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదారు క్యారెట్ స్లైసెస్,( Carrot Slices ) నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.
అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు టమాటో క్యారెట్ జ్యూస్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
నాలుగు నిమిషాలు మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.
నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే మీ స్కిన్ కలర్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది.
ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.అలాగే ఈ క్రీమ్ ముడతలకు చెక్ పెడుతుంది.
స్కిన్ ను టైట్ చేసి యవ్వనంగా కనిపించేలా ప్రోత్సహిస్తుంది.అంతేకాకుండా ఈ క్రీమ్ ను వాడటం వల్ల స్పాట్ లెస్ స్కిన్ ను సైతం పొందుతారు.
వీడియో: తండ్రితో కలిసి తాజ్ మహల్ చూడడానికి వచ్చిన ఫారినర్కు చేదు అనుభవం..?