ఫేస్ పై డార్క్ ప్యాచెస్ అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే వాటిని ఇలా వదిలించుకోండి!

సాధారణంగా కొందరికి ఫేస్ పై డార్క్ ప్యాచెస్ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు.

హైపర్‌ పిగ్మెంటేషన్( Pigmentation ) కారణంగా డార్క్ ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.చర్మం సాధారణం కంటే ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి చేసినప్పుడు డార్క్ ప్యాచెస్ కనిపిస్తాయి.

వీటి కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు.ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా అసహనం వ్యక్తం చేస్తుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.

‌ ఫేస్ పై డార్క్ ప్యాచెస్ ను మాయం చేయడానికి ఒక అద్భుతమైన హోమ్ మేడ్ క్రీమ్ ఉంది.

రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను వాడితే చర్మంపై అస‌హ్యంగా క‌నిపించే డార్క్ ప్యాచెస్ కు గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం, అంగుళం దాల్చిన చెక్క వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకోవాలి.

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన క్రీమ్ సిద్ధమవుతుంది. """/" / ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ న్యాచురల్ క్రీమ్ ను వాడితే చర్మంపై డార్క్ ప్యాచెస్ క్రమంగా మాయం అవుతాయి.

మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఈ క్రీమ్ స్కిన్ ఏజింగ్( Skin Aging ) ను ఆలస్యం చేస్తుంది.

ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా అడ్డుకుంటుంది.చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.

అమ్మలా ప్రేమను పంచాడు.. నన్ను నెత్తిన పెట్టుకున్నాడు.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్!