పల్చటి జుట్టుకు పుదీనాతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే?

ఆకు కూరల్లో పుదీనా( Mint ) కూడా ఒకటి.నాన్ వెజ్, బిర్యానీ వంటి వంటలకు పుదీనా ప్రత్యేకమైన రుచి మరియు ఫ్లేవర్ ను అందిస్తుంది.

అలాగే పుదీనా ఆకులు యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్‌లతో నిండి ఉంటాయి.విటమిన్ ఎ, విటమిన్ సి, బి-కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, ఇనుము, పొటాషియం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా పుదీనాలో ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా పుదీనా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.అయితే జుట్టు సంరక్షణకు సైతం పుదీనా తోడ్పడుతుంది.

ముఖ్యంగా పల్చటి జుట్టుతో( Thin Hair ) బాధపడే వారికి పుదీనా ఒక వారం అనే చెప్పవచ్చు.

పల్చటి జుట్టుకు చెక్ పెట్టి కురులను ఒత్తుగా మార్చే దత్తా పుదీనా కు ఉంది.

అందుకోసం పుదీనాను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా రెండు కట్టల పుదీనాను వాటర్ తో క‌డిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.

ఆపై ఎండలో పూర్తిగా ఎండనిచ్చి మిక్సీ జార్ లో మెత్తని పొడి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పుదీనా ఆకుల పొడి, రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడి( Fenugreek Powder ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ పుదీనా హెయిర్ మాస్క్( Mint Hair Mask ) వేసుకుంటే కొన్ని వారాల తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

ఈ హెయిర్ మాస్క్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతుంది.

ఊడిన జుట్టును మళ్లీ మొలిపిస్తుంది.పల్చటి జుట్టు సమస్యను దూరం చేస్తుంది.

కాబట్టి ఎవరైతే పల్చటి జుట్టుతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న పుదీనా హెయిర్ మాస్క్ వేసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

నా సినిమాకు అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!