మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ మాస్క్ ను ప్రయత్నించండి?
TeluguStop.com
తమ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగాలని చాలా మంది ఆడవారు ఆరాటపడుతూ ఉంటారు.
అటువంటి జుట్టును పొందడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.ఖరీదైన షాంపూ, కండిషనర్ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తారు.
అయినా సరే జుట్టు ఎదుగుదలలో పెద్దగా మార్పు లేకుంటే ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.
ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ ను తప్పకుండా ప్రయత్నించండి.
"""/" /
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు(Mustard Powder), వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు(Flax Seeds), వన్ టేబుల్ స్పూన్ మెంతులు(Fenugreek) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు, మెంతులు, ఆవాల పొడిని వేసి ఉడికించాలి.
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.
కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.అలాగే ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.మరియు కురులను స్మూత్ అండ్ సిల్కీ గా మారుస్తుంది.
రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?