Hair Fall: జుట్టు ఆరోగ్యానికి అండగా నిలిచే బెస్ట్ హోమ్ మేడ్ సీరం.. అస్సలు మిస్ అవ్వకండి!

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.

? హెయిర్ గ్రోత్ అస్సలు లేదా.? అయితే వర్రీ అవకండి.

ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ సీరం ఒకటి ఉంది.

ఈ సీరం మీ జుట్టు ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.అనేక జుట్టు సంబంధిత సమస్యలను( Hair Related Problems ) నివారిస్తుంది.

మరి ఇంకెందుకు ఆల‌స్యం సీరంను ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.అలాగే రెండు స్పూన్లు అల్లం ముక్కలు( Ginger Slices ), రెండు గింజ తొలగించిన ఉసిరికాయలు( Amla ) వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఈ అల్లం, మెంతులు, ఉసిరికాయ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ వండర్ ఫుల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ సీరంను కనుక వాడితే అనేక లాభాలు మీ సొంతం అవుతాయి.

ఈ సీరం మీ జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ సీరం హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.ఒత్తైన ఆరోగ్యమైన కురులు మీ సొంతం అయ్యేలా చేస్తుంది.

కాబట్టి హెల్తీ హెయిర్ ను కోరుకునే వారు ఈ సీరంను అస్సలు మిస్ అవ్వకండి.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?