Hair Serum : కలబందతో ఈ సీరంను తయారు చేసుకుని వాడారంటే మీ జుట్టు డబుల్ అవుతుంది!
TeluguStop.com
మీ జుట్టు( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.
? హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టి మళ్లీ జుట్టును ఒత్తుగా మార్చుకోవాలని భావిస్తున్నారా.
? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే కలబంద సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ సీరం ను వాడారంటే మీ జుట్టు డబుల్ అవుతుంది.
అదే సమయంలో హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem ) సైతం దూరం అవుతుంది.
మరింతకీ కలబందతో సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera )ను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ కలబంద జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన సీరం సిద్ధపడుతుంది. """/"/
ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ తో శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ కలబంద సీరంను వాడడం వల్ల క్రమంగా జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్( Hair Growth ) అవుతుంది.
ఫలితంగా కొద్ది రోజుల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.పైగా ఈ సీరంను వాడడం వల్ల చుండ్రు సమస్య ( Dandruff )ఉంటే పరార్ అవుతుంది.
హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.మరియు కురులు ఆరోగ్యంగా సైతం మారతాయి.
యూఎస్ కాంగ్రెస్‌లో పెరిగిన ‘సమోసా’ కాకస్ బలం .. అసలేంటిది?