జలుబు, దగ్గు, కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!

వర్షాలు దంచికొడుతున్నాయి.గత మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వర్షాలు పడడంతో ప్రజలు బయట కాలు పెట్టడానికి కూడా వీలు కావడం లేదు.

ఇకపోతే ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు ఎంతలా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వీటి కారణంగా కంటికి కునుకుండదు.మనసుకు కుదురుండదు.

ఈ క్రమంలోనే కొంత మంది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి బయటపడటం యాంటీబయాటిక్స్ సహాయం తీసుకుంటుంటారు.

అయితే వాటి అవసరం లేకుండా కూడా ఆయా సమస్యలను వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరు మిరియాలు, ఆరు లవంగాలు, వన్ టీ స్పూన్ ధనియాలు( Coriander ), అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ శొంఠి పొడి, వన్ టీ స్పూన్ వాము, చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. """/" / ఆ తర్వాత స్టవ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా సేవించండి.

ఈ """/" / డ్రింక్‌ లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మ‌రియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

అందువ‌ల్ల రోజుకు ఒకసారి ఈ డ్రింకర్ ను కనుక తీసుకుంటే జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు పరారవుతాయి.

కఫం మొత్తం కరిగిపోతుంది.శ్వాస మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి.

అలాగే ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా సైతం పనిచేస్తుంది.కాబట్టి ఎవరైతే జలుబు, దగ్గు( Cold, Cough ) వంటి సీజన‌ల్‌ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వారు ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల లేటెస్ట్ లెక్కలు వింటే మాత్రం షాకవ్వాల్సిందే!