చలికాలంలోనూ జుట్టు సిల్కీగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాను అస్సలు మిస్ అవ్వొద్దు!
TeluguStop.com
సాధారణంగా వింటర్ సీజన్ లో వాచ్చే మార్పుల కారణంగా దాదాపు ప్రతి ఒక్కరి జుట్టు డ్రై( Dry Hair ) గా మారుతుంటుంది.
అటువంటి జుట్టును రిపేర్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారు.ఖరీదైన ఆయిల్, షాంపూ, కండిషనర్ ను యూస్ చేస్తుంటారు.
అయినా సరే ఎలాంటి ఫలితం ఉండటం లేదా.? అయితే అసలు చింతించకండి.
చలికాలంలోనూ జుట్టు సిల్కీగా మెరిసిపోతూ కనిపించాలంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను ట్రై చేస్తే మీ జుట్టు సూపర్ సిల్కీగా షైనీగా మెరుస్తుంది.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి. """/" /
ముందుగా ఒక అవకాడో మరియు ఒక అరటి పండును( Banana Fruit ) తీసుకోవాలి.
తొక్క తొలగించి అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.మరియు అవకాడో( Avocado ) లో ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో అరటిపండు ముక్కలు, అవకాడో పల్ప్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg White ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.అరటి పండు, అవకాడో, గుడ్డు జుట్టుకు సహజ తేమ ను అందిస్తాయి.
పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.మీ హెయిర్ ఎంత డ్రైగా ఉన్న సరే ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా సిల్కీగా మారుతుంది.
షైనీగా మెరుస్తుంది.అలాగే హెయిర్ మాస్క్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఆరోగ్యమైన ఒత్తైన కురులను మీ సొంతం చేస్తుంది.
బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదా.. అక్కడ జరిగింది ఇదేనా?