ఇవి రెండు ఉంటే చాలు రెండు నెలల్లో లాంగ్ అండ్ సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది!

సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది లాంగ్ అండ్ సిల్కీ హెయిర్ ను కోరుకుంటారు.

అటువంటి జుట్టు కోసం తెగ ఆరాటపడుతుంటారు.జుట్టును పొడుగ్గా మరియు సిల్కీగా మార్చుకోవడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.

అలాగే ఖరీదైన షాంపూలు వినియోగిస్తారు.అయితే మీరు కోరుకున్నట్లుగా మీ జుట్టు మారాలి అంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించడం ఎంతో అవసరం.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ఫాలో అయితే రెండు నెలల్లో లాంగ్ అండ్ సిల్కీ హెయిర్ మీ సొంతం అవ్వడం ఖాయం.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి కొబ్బరి పాలు( Coconut Milk )ను స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని పాటించారంటే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందుతారు.

ముఖ్యంగా ఈ హెయిర్ మాస్క్ జుట్టును సిల్కీగా మారుస్తుంది.షైనీ గా మెరిపిస్తుంది.

అలాగే కొబ్బరి పాలు మరియు మెంతుల్లో ఉండే పోషకాలు హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.అలాగే కొబ్బరి పాలు, మెంతులు ఇవి రెండు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.

కాబట్టి ఆరోగ్యమైన పొడవాటి మరియు సిల్కీ జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!