Glowing Skin :మేకప్ లేకపోయినా ముఖం గ్లోయింగ్ గా మెరిసిపోవాలా.. అయితే ఇది ట్రై చేయండి!

ఎటువంటి మచ్చలు లేకుండా ముఖ చర్మం సహజంగానే గ్లోయింగ్ గా మెరిసిపోవాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదు.కానీ కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చర్మాన్ని అందంగా మరియు కాంతివంతంగా మార్చడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మేకప్ లేకపోయినా మీ ముఖం గ్లోయింగ్ గా మెరిసిపోతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రెగ్యుల‌ర్‌గా రైస్ మిగిలిపోతూ ఉంటుంది.

ఆ రైస్ ను కొందరు మరుసటి రోజు తింటుంటారు.ఇంకొందరు బయట పారేస్తుంటారు.

అయితే మిగిలిపోయిన రైస్ ( Rice )తో మనం ఒక అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

దాని కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రైస్, మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ ( Rose Water )వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn Flour ), రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ), మూడు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. """/" / రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.

అందంగా మెరిసిపోతుంది.అలాగే ఈ రెమెడీ చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది.అంతేకాదు ఈ రెమెడీ ముదురు రంగు మచ్చలను తగ్గించి చర్మ రంగును మెరుగుపరుస్తుంది.

మేకప్ లేకపోయినా సరే మిమ్మల్ని అందంగా ఆకర్షణీయంగా చూపిస్తుంది.

ప్రవాస భారతీయులకు బిగ్ రిలీఫ్ .. బెంగళూరు నగర పాలక సంస్థ సంచలన నిర్ణయం