Glowing Skin : ఒక్క రాత్రిలో గ్లోయింగ్ స్కిన్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ఏదైనా పెళ్లి లేదా ఇంకేదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని ఆరాటపడుతూ ఉంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు తమ ముఖ చర్మం గ్లోయింగ్ గా మెరిసిపోతూ ఉండాల‌ని వేలకు వేలు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా సహజంగా కూడా అందమైన కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

అందుకు ఎన్నో అద్భుతమైన రెమెడీలు ఉన్నాయి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.

ఈ రెమెడీ ద్వారా కేవలం ఒక్క రాత్రిలోనే బ్యూటిఫుల్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ( Chia Seeds )మరియు పావు కప్పు పాలు( Cup Of Milk ) వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక కలబంద( Aloe Vera ) ఆకుని తీసుకొని వాటితో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను వేసుకోవాలి.

"""/" / అలాగే కలబంద జెల్ మరియు కొన్ని టమాటా( Tomato ) ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ సింపుల్ రెమెడీని పాటించాలంటే ఉదయానికి మీ స్కిన్ లో చాలా మార్పును గమనిస్తారు.

చియా సీడ్స్, పాలు, అలోవెరా జెల్ మరియు టమాటా లో ఉండే పోషకాలు చర్మాన్ని ఉత్తేజంగా మారుస్తాయి.

"""/" / డెస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ ను రిమూవ్ అవుతాయి.చర్మం సూపర్ గ్లోయింగ్ మరియు అందంగా మారుతుంది.

ఒక్క రాత్రిలో కాంతివంతమైన చర్మాన్ని పొందాలని కోరుకునే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే ఈ ఫేస్ మాస్క్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.తరచూ ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మంపై మొటిమలు, మచ్చలు ఉంటే పరారవుతాయి.చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ లు వీళ్ళే… ఈ సీజన్లో స్పెషల్ గెస్ట్ లు ఎవరో తెలుసా?