ఎన్ని చేసినా దగ్గు తగ్గడం లేదా.. ఈ వంటింటి చిట్కాను పాటిస్తే రెండు రోజుల్లో పరార్ అవుతుంది!
TeluguStop.com
దగ్గు( Cough ).అత్యంత సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.
దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దగ్గు సమస్యను ఎదుర్కొనే ఉంటారు.
దగ్గు అనేది చిన్న సమస్యే అయినప్పటికీ దాని కారణంగా అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తారు.
తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.దగ్గును వదిలించుకునేందుకు రకరకాల టానిక్ లు, మందులు వాడుతుంటారు.
అయినా సరే ఒక్కోసారి దగ్గు వదిలిపెట్టదు.అటువంటి మొండి దగ్గును తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన ఇంటి చిట్కా ఉంది.
ఈ ఇంటి చిట్కాను పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే దగ్గు పరారవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న ఉల్లిపాయలు( Onions ) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.
ఆపై సన్నగా తురుముకోవాలి.ఈ ఉల్లి తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon Juice )మరియు వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఒక మంచి టానిక్ సిద్ధమవుతుంది.
ఈ టానిక్ ను నేరుగా సేవించాలి. """/" /
రోజు ఉదయం సాయంత్రం ఈ టానిక్ ను తయారు చేసుకుని తీసుకోవాలి.
ఉల్లిపాయ, తేనె యాంటీఆక్సిడెంట్లు ( Antioxidants )మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది.
అలాగే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఈ మూడింటి కలయిక ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది.
ముఖ్యంగా ఉల్లిపాయ జ్యూస్, లెమన్ జ్యూస్ మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. """/" /
ముఖ్యంగా దగ్గును సమర్థవంతంగా అణిచివేస్తుంది.
మొండి దగ్గుతో బాధపడుతున్న వారికి ఈ ఇంటి చిట్కా ఎంతో బాగా సహాయపడుతుంది.
ఈ చిట్కాను పాటిస్తే దగ్గు మాత్రమే కాకుండా జలుబు సమస్య ఉన్న కూడా దూరమవుతుంది.
అంతేకాకుండా గ్యాస్, ఛాతిలో పట్టేసినట్టు ఉండడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి క్షణాల్లో రిలీఫ్ అందించడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది.
జర్మనీకి పెరుగుతోన్న భారతీయ పర్యాటకులు.. 2024లో ఎన్ని లక్షల మంది వెళ్లారంటే?