కఫం కరగాలంటే ఈ ఇంటి చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
TeluguStop.com
సీజన్ మారినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల కొందరికి కఫం బాగా పట్టేస్తుంటుంది.
ఈ కఫం కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక తదితర సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ క్రమంలోనే కఫాన్ని( Phlegm ) కరిగించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా కఫాన్ని కరిగించగలవు.
అటువంటి చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మిరియాలు( Black Pepper ) పసుపు.
( Turmeric ) ఈ రెండిటి కాంబినేషన్ కఫానికి విరుగుడుగా పని చేస్తుంది.
ఒక గ్లాస్ వేడి పాలలో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు మరియు ఒక స్పూన్ ఆర్గానిక్ తేనె వేసి బాగా మిక్స్ చేసి సేవించాలి.
ప్రతిరోజు ఈ పానీయాన్ని తీసుకుంటే కఫం కరిగిపోతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
"""/" /
కఫాన్ని బయటకు పంపడంలో అల్లం( Ginger ) కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.
రెండు టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం రసంలో హాఫ్ టీ స్పూన్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.
నిత్యం ఈ విధంగా చేసిన కూడా కఫం కరిగిపోతుంది. """/" /
అలాగే కఫం తో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉప్పు నీటితో పుక్కిలించాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు( Salt ) వేసి మిక్స్ చేయాలి.
ఈ నీటిని నోట్లో పోసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు పుక్కిలించాలి.ఆపై నోటిని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే కఫం పల్చగా మారి బయటకు వచ్చేస్తుంది.ఇక లెమన్ కూడా కఫాన్ని కరిగించడంలో సహాయపడుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు పావు టీ స్పూన్ మిరియాల పొడి మిక్స్ చేసి సేవించాలి.
రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తాగితే కఫం దెబ్బకు కరిగిపోతుంది.
పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది.
కొత్త హీరోయిన్ కు స్టార్ హీరో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం ఇదే.. అసలేం జరిగిందంటే?