Hibiscus Flower : నాలుగు మందారం పువ్వుల‌తో ప్రతివారం ఇలా చేశారంటే జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు!

గ్రామాల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మందారం చెట్టు ఉంటుంది.మందారం పువ్వులు( Hibiscus ) కోసి నిత్యం పూజ చేసేవారు ఎంతో మంది ఉన్నారు.

అయితే మందారం పువ్వులు పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి మరియు జుట్టు సంరక్షణకు సైతం అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా కేశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి మందార పువ్వులు ఎంతో బాగా సహాయపడతాయి.

నాలుగు మందార పువ్వులతో ప్రతివారం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే ఆల్మోస్ట్ జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.

"""/" / అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు ఫ్రెష్ మందార పువ్వులను వేసుకోవాలి.

అలాగే అర కప్పు బియ్యం కడిగిన నీరు లేదా గంజి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి.

40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఇలా చేస్తే సరిపోతుంది. """/" / మందార పువ్వుల్లో జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, మినరల్స్ నిండి ఉంటాయి.

అవి జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడతాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.

మందారం లో ఉండే అమైనో ఆమ్లాలు తలలో రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి.ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మందార పువ్వుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఇవి స్కాల్ప్‌ ను హెల్తీగా మారుస్తాయి.

చుండ్రు, దురద వంటి సమస్యలను నివారిస్తాయి.మందార పువ్వులు జుట్టును స్మూత్‌గా మరియు షైనీగా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి.

అంతేకాదు మందారం పువ్వు( Hibiscus Flower )ల‌తో పైన చెప్పిన రెమెడీని పాటిస్తే జుట్టు ముక్కల అవడం, చిట్లడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

కురులు హెల్తీగా స్ట్రాంగ్ గా మ‌రియు ఒత్తుగా మారతాయి.

కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!