వేపాకు, కరివేపాకు రెండింటినీ ఇలా తలకు రాశారంటే చుండ్రు ఒక్క దెబ్బతో పరారవుతుంది!

చుండ్రు( Dandruff )తో బాధపడుతున్నారా.? ఎన్ని రకాల షాంపూలు ప్రయత్నించినా చుండ్రు పోవడం లేదా.

? చుండ్రుతో బాగా విసిగిపోయారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.

చుండ్రు అనేది చాలా చిన్న సమస్య.సరైన చిట్కాలను పాటిస్తే ఎంతో సులభంగా దాన్ని వదిలించుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చుండ్రును నివారించడానికి సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

"""/" / అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకు తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు, నాలుగు రెబ్బలు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, ఐదు నుంచి ఆరు మిరియాలు మరియు పావు కప్పు బియ్యం కడిగిన నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను స‌ప‌రేట్‌ చేసుకోవాలి.

"""/" / ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard Oil ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

దీంతో ఒక మంచి హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేయాలి.

ఆపై స్కాల్ప్ ను పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే ఆల్మోస్ట్ చుండ్రు మొత్తం తొలగిపోతుంది.

ఇంకా చుండ్రు కనుక ఉంటే మరో రెండు సార్లు ఈ హెయిర్ టానిక్ ను ప్రయత్నించండి.

శాశ్వతంగా చుండ్రుకు దూరంగా ఉండాలని భావిస్తే వారానికి ఒకసారి హెయిర్ టానిక్ ను వాడండి.

పైగా ఈ న్యాచురల్ టానిక్ ను వాడటం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

హెయిర్ బ్రేకేజ్ కంట్రోల్ అవుతుంది.పొడిగా నిర్జీవంగా మారిన జుట్టు సిల్కీగా, స్మూత్ గా మారుతుంది.

నటి పూర్ణతో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన నటుడు రవిబాబు!